మూడు రోజుల పాటు అన్ని మ్యూజియాల్లోకి ఉచిత ప్రవేశం
- May 18, 2023
ఖతార్: అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఖతార్‌లోని అన్ని మ్యూజియంలు ఈ రోజు(మే 18) నుండి శనివారం(మే 20) వరకు మూడు రోజుల పాటు ప్రజలకు ఉచితంగా ప్రవేశాన్ని కల్పిస్తున్నట్లు ఖతార్ మ్యూజియమ్స్ (QM) ప్రకటించింది. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం ఈ సంవత్సరం ‘‘మ్యూజియంలు, సుస్థిరత, శ్రేయస్సు, సమాజాల శ్రేయస్సు, స్థిరమైన అభివృద్ధి, వాతావరణ చర్యలు, సామాజిక పోరాటం, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో మ్యూజియంలు పోషించే కీలక పాత్ర’’ అనే థీమ్ లతో జరుపుకుంటుంది. ఈ సందర్భంగా విద్యా కార్యక్రమాలు, ప్రదర్శనలు, కమ్యూనిటీ ఔట్రీచ్ లను ఏర్పాటు చేయనుందని ఖతార్ మ్యూజియమ్స్ సీఈఓ అహ్మద్ మూసా అల్ నమ్లా చెప్పారు. ఈ రోజు మన భాగస్వామ్య సాంస్కృతిక వారసత్వాన్ని రాబోయే తరాలకు ప్రోత్సహించడం, సంరక్షించడం మన బాధ్యతను గుర్తు చేస్తుందన్నారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..







