కువైట్ లో అస్థిర వాతావరణం.. వారాంతంలో వర్షం..!
- May 18, 2023
కువైట్: కువైట్ లో గురువారం మొదలు శనివారం వరకు అస్థిర వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. అదే సమయంలో రాబోయే ఐదు రోజులలో వాతావరణం వేడిగా ఉంటుందని, తేమ-గాలుల పెరుగుదల ఉంటుందని, వచ్చే ఆదివారం నాటికి వాతావరణ పరిస్థితులు స్థిరంగా ఉంటాయని వాతావరణ సూచన పరిశీలకుడు అబ్దుల్ అజీజ్ అల్-ఖరావి చెప్పారు. ఆదివారం వాతావరణ పరిస్థితులు స్థిరంగా ఉంటాయని, వాతావరణం సాధారణంగా పగటిపూట వేడిగానూ, రాత్రిపూట తేలికగానూ ఉంటుందని ఆయన తెలిపారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో గురు, శనివారాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడు ఇస్సా రందాన్ వివరించారు. వారాంతంలో ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని ఖగోళ శాస్త్రవేత్త అడెల్ అల్-సాదూన్ కూడా వెల్లడించారు.
తాజా వార్తలు
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







