ఐపీఎల్ 2023: హైదరాబాద్ పై బెంగళూరు ఘన విజయం
- May 18, 2023
హైదరాబాద్: ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బెంగళూరు ఓపెనర్లు దుమ్మురేపారు. విరాట్ కోహ్లి సెంచరీతో ఉతికారేయడంతో ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లి (100; 63 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకంతో చెలరేగగా డుప్లెసిస్(71; 47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొట్టాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, నటరాజన్ చెరో వికెట్ తీశారు.
అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్(104 51 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీ చేశాడు. 49 బంతుల్లో ఐపీఎల్లో తన మొదటి శతకాన్ని అందుకున్నాడు. మిగిలిన వారిలో హ్యారీ బ్రూక్( 27నాటౌట్ 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అభిషేక్ శర్మ(11), రాహుల్ త్రిపాఠి(15), మార్క్రమ్(18)లు విఫలం అయ్యారు. బెంగళూరు బౌలర్లలో బ్రేస్‌వెల్ రెండు వికెట్లు తీయగా, సిరాజ్, షాబాద్ అహ్మద్, హర్షల్ పటేల్‌లు ఒక్కొ వికెట్ పడగొట్టారు.
తాజా వార్తలు
- అల్ మెన్హాద్ ఎయిర్‌బేస్‌పై క్షిపణి దాడి.. వార్తలను ఖండించిన యూఏఈ రక్షణ శాఖ
- ఇరాన్ నుంచి యూఏఈ ప్రాదేశిక జలాల్లోకి UAV.. అప్రమత్తమైన వైమానిక దళం
- సౌదీ అరేబియాలో మయన్మార్, బంగ్లాదేశ్‌కు చెందిన నలుగురు అరెస్ట్..!!
- Dh964 షాపింగ్ బిల్లుతో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ గెలిచిన సేల్స్‌మ్యాన్..!!
- అల్ హిద్లో చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- 21 హెల్తీ సిటీలతో సౌదీ అరేబియా.. రీజియన్‌లో టాప్..!!
- భారత పర్యాటకులకు అబుదాబి గుడ్ న్యూస్..వీసా ఫ్రీ..!!
- కువైట్‌లో రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ లోకి ప్రభుత్వ కార్యాలయాలు..!!
- ఖతార్‌లో బలమైన ఈదురుగాలులు.. తగ్గనున్న విజిబిలిటీ..!!
- నేపాల్ వరదల్లో 72 గంటలు.. కొండపై చిక్కుకున్న ఒమానీ మహిళ సేఫ్..!!







