ఉక్రెయిన్‌కు ఎఫ్-16 ఫైటర్ జెట్లను సరఫరా చేయనున్న అమెరికా
- May 20, 2023
కీవ్: ఉక్రెయిన్ దళాలకు ఎఫ్-16 ఫైటర్ విమానాలను సరఫరా చేయాలని అమెరికా యోచిస్తున్నది. జపాన్‌లో జరుగుతున్న జీ7 సమావేశాల్లో దీనిపై అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ సెక్యూర్టీ అడ్వైజర్ జేక్ సుల్వినన్ తెలిపారు. అత్యంత అధునాతన ఎఫ్-16 ఫైటర్ విమానాల విషయంలో కీవ్ పైలెట్లకు అమెరికా దళాలు శిక్షణ ఇవ్వనున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. ఎఫ్-16 ఫైటర్ జెట్స్ కావాలని ఉక్రెయిన్ చాన్నాళ్ల నుంచి అమెరికాను అభ్యర్థిస్తున్నది. అమెరికా చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడు వోల్డోమిర్ జెలెన్స్కీ తెలిపారు.
కాగా,అమెరికా పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు యుద్ధ విమానాలను సరఫరా చేయనున్నాయి. దాంట్లో ఎఫ్-16 యుద్ధ విమానం కూడా ఉంటుందని అమెరికా వెల్లడించింది. ఉక్రెయిన్ పైలెట్లకు ఫైటర్ జెట్ శిక్షణ ఇవ్వనున్నట్లు అమెరికా చెప్పింది.
తాజా వార్తలు
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్







