నిహారిక ‘డెడ్ పిక్సల్స్’.! ఈ నేరం క్షమించరానిది.!
- May 20, 2023
మెగా డాటర్ నిహారిక ఈ మధ్య సినిమాల కన్నా, పర్సనల్ రూమర్స్‌తోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది చైతన్యతో వివాహం చేసుకున్న నిహారిక అభిప్రాయ బేధాల కారణంగా ఆయనకు విడాకులిచ్చేయబోతోందంటూ గత కొన్నాళ్లుగా వార్తలు గుప్పుమంటున్నాయ్.
కానీ, ఈ వార్తలపై మెగా ఫ్యామిలీ కానీ, నిహారిక కానీ స్పందించలేదు. అలా అని ఆ వార్తల్ని ఖండించలేదు. అలా నిహారిక విడాకులూ, రెండో పెళ్లి.. అంటూ దాదాపుగా ప్రతీ రోజూ సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో కథనాలు పుట్టుకొస్తూనే వున్నాయ్.
ఇదిలా వుంటే, తాజాగా నిహారిక నటించిన ‘డెడ్ పిక్సల్స్’ అనే వెబ్ సిరీస్ ఒకటి తాజాగా ఓటీటీలోకి లాంఛ్ అయ్యింది.
ఓటీటీ కంటెంట్ అంటే చాలా మెచ్చూర్డ్‌గా, గ్రిప్పింగ్‌గా వుంటోంది. స్టార్ కాస్టింగ్‌తో సంబంధం లేకుండానే కొన్ని వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయ్. అలాంటిది నిహారిక వంటి స్టార్ స్టేటస్ వున్న నటి చేసిన వెబ్ సిరీస్ అంటే ప్రేక్షకుల ఊహ ఏ రేంజ్లో వుంటుంది.?
కానీ, నిహారిక ‘డెడ్ పిక్సల్స్’ పరమ చెత్త, సుత్తి సిరీస్ చేసింది. ఇదే ఓటీటీ ఆడియన్స్ అభిప్రాయం. ఇలాంటి చెత్త వెబ్ సిరీస్ చేయకపోతే ఖాళీగా కూర్చుంటే పోలా.! ప్రేక్షకులు మరీ ఇంత వెర్రి వెంగళప్పల్లా కనిపిస్తున్నారా.? అంటూ దారుణంగా తిట్టి పోస్తున్నారు. ఇలాంటి వెబ్ సిరీస్‌లో నిహారిక ఎందుకు నటించిందో ఆమెకే తెలియాలి.
తాజా వార్తలు
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్‌కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!







