‘ఆది పురుష్’ ప్రమోషన్స్.! స్వయంగా రంగంలోకి దిగిన ఫ్యాన్స్.!
- May 20, 2023
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రబాస్ నటిస్తున్న చిత్రం ‘ఆది పురుష్’. ఈ సినిమా గురించి మొదటి నుంచీ నెగిటివిటీ ఓ రేంజ్‌లో నడుస్తున్న సంగతి తెలిసిందే.
రీసెంట్‌గా రిలీజ్ చేసిన టీజర్ కా..స్త ఊరటనిచ్చినప్పటికీ సినిమాపై పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు. ఇక, వెరీ లేటెస్ట్‌గా సినిమా నుంచి ‘జై శ్రీరామ్..’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు.
ఈ సాంగ్ కూడా జస్ట్ సో సోగా రెస్పాన్స్ అందుకుంటోంది. కాగా, ఈ పాటతో సినిమాని ఇంకాస్త జనంలోకి దూకుడుగా తీసుకెళ్లేందుకు స్వయంగా ప్రబాస్ ఫ్యాన్సే రంగంలోకి దిగారు.
బైక్ ర్యాలీతో ‘జై శ్రీరామ్..’ అనే నినాదాలతో ప్రబాస్ ‘ఆది పురుష్’ని ప్రమోట్ చేసే బాధ్యతను నెత్తిన వేసుకున్నారు. రెండు తెలుగు రాష్ర్టాల్లోని పెద్ద పెద్ద సిటీల్లో ఈ శ్లోగన్స్‌తో రెండు, మూడు రోజుల పాటు ర్యాలీగా సినిమాని ప్రమోట్ చేయనున్నారట. చూడాలి మరి, అభిమానుల ఆరాటం ఈ సారైనా ప్రబాస్‌కి సరైన హిట్ తెచ్చిపెడుతుందో లేదో.!
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







