‘దేవర’గా ఎన్టీయార్.! అంచనాలు అప్పుడే కాదు సుమా.!
- May 20, 2023
యంగ్ టైగర్ ఎన్టీయార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా సినిమా నుంచి అప్డేట్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీయార్ నటిస్తున్న సినిమాకి టైటిల్ కన్ఫామ్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.
సముద్రానికి రాజుగా సీరియస్ ఇంటెన్స్ లుక్స్‌లో డిఫరెంట్ గెటప్‌లో కనిపిస్తున్నాడు ఈ లుక్స్‌లో ఎన్టీయార్. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీయార్ నుంచి వస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలున్న మాట వాస్తవమే.
అయితే, ‘ఆర్ఆర్ఆర్’ వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత ఎన్టీయార్ ఇమేజ్ గ్లోబల్ రేంజ్ అందుకుంది. ఇమేజ్‌తో పాటూ, బాధ్యత కూడా అదే స్థాయిలో వుంది ఎన్టీయార్ మీద.
కానీ, ‘ఆచార్య’ దెబ్బతో కొరటాల మీదే అందరికీ డౌట్ కొడుతోంది. అందుకే టైటిల్, ఫస్ట్‌లుక్ వచ్చినా ఏమంత అంచనాలు పెంచేయకుండా ఒకింత కామ్‌గా వున్నారు ఎన్టీయార్ అభిమానులు. లేదంటే ఈ పాటికి అహో, ఓహో అంటూ ఊదరగొట్టేసేవాళ్లు.
అంచనాలన్నీ రిలీజ్ తర్వాతే చూసుకుందాం అన్నట్లుగా తుపాను ముందర సైలెన్స్ పాటిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







