‘ఆది పురుష్’ ప్రమోషన్స్.! స్వయంగా రంగంలోకి దిగిన ఫ్యాన్స్.!
- May 20, 2023బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రబాస్ నటిస్తున్న చిత్రం ‘ఆది పురుష్’. ఈ సినిమా గురించి మొదటి నుంచీ నెగిటివిటీ ఓ రేంజ్లో నడుస్తున్న సంగతి తెలిసిందే.
రీసెంట్గా రిలీజ్ చేసిన టీజర్ కా..స్త ఊరటనిచ్చినప్పటికీ సినిమాపై పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు. ఇక, వెరీ లేటెస్ట్గా సినిమా నుంచి ‘జై శ్రీరామ్..’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు.
ఈ సాంగ్ కూడా జస్ట్ సో సోగా రెస్పాన్స్ అందుకుంటోంది. కాగా, ఈ పాటతో సినిమాని ఇంకాస్త జనంలోకి దూకుడుగా తీసుకెళ్లేందుకు స్వయంగా ప్రబాస్ ఫ్యాన్సే రంగంలోకి దిగారు.
బైక్ ర్యాలీతో ‘జై శ్రీరామ్..’ అనే నినాదాలతో ప్రబాస్ ‘ఆది పురుష్’ని ప్రమోట్ చేసే బాధ్యతను నెత్తిన వేసుకున్నారు. రెండు తెలుగు రాష్ర్టాల్లోని పెద్ద పెద్ద సిటీల్లో ఈ శ్లోగన్స్తో రెండు, మూడు రోజుల పాటు ర్యాలీగా సినిమాని ప్రమోట్ చేయనున్నారట. చూడాలి మరి, అభిమానుల ఆరాటం ఈ సారైనా ప్రబాస్కి సరైన హిట్ తెచ్చిపెడుతుందో లేదో.!
తాజా వార్తలు
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి
- బీచ్లో ప్రమాదకరమైన ప్రవాహాలు..నివాసితులకు వార్నింగ్
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..