రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల పై సిఎం కెసిఆర్ సమీక్ష సమావేశం
- May 20, 2023
హైదరాబాద్: సిఎం కెసిఆర్ ఈరోజు రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలపై సమీక్ష నిర్వహించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా శాఖల ప్రతిపాదనలపై సీఎం అధికారులతో చర్చిస్తున్నారు. రాష్ట్రం ఈ 9 ఏండ్లలో సాధించిన విజయాలను ప్రతిబింబించేలా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. జూన్ 2న ప్రారంభమై 21 రోజులపాటు కొనసాగనున్న ఉత్సవాల ప్రణాళికను సిద్ధం చేసేందుకు శుక్రవారం సచివాలయంలో మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







