యూఏఈ లో కార్ల వేలం: సగం ధరకే కార్లు..!
- May 23, 2023
యూఏఈ: యూఏఈలో అతిపెద్ద లైవ్ కార్ వేలం లో కొనుగోలుదారులు, విక్రేతలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో కొందరు Dh40,000 విలువైన కార్లను Dh20,000 కే దక్కించుకున్నారు. ఆదివారం సాయంత్రం షార్జా ఇండస్ట్రియల్ ఏరియా 2లో మర్హబా ఆక్షన్స్ ద్వారా జరిగిన వేలంలో 2,000 మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. లైవ్ బిడ్డింగ్ కోసం 360 ప్రీ-ఓన్డ్ కార్లను అందుబాటులో పెట్టినట్లు మర్హబా వేలం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జుబైర్ రషీదీ వెల్లడించారు. ప్రజలు మార్కెట్ ధర కంటే 30 నుండి 40 శాతం తక్కువ ధరకు కార్లను వేలంలో చాలామంది కొనుగోలు చేశారన్నారు. కార్లు కొనుగోలుచేసిన వారిలోంచి ఎంపిక చేసిన వారికి బంగారు కడ్డీలు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ఫోన్లు ఇతర బహుమతులను అందజేస్తామని వివరించారు. తమ వద్ద అన్ని రకాల మిక్స్డ్ టైప్ మోడల్లు, అన్ని రకాల ధరలు, లగ్జరీ, ప్రీమియం, ఎకానమీ, కార్లు, ప్రజల కోసం అన్ని రకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. వ్యక్తిగతంగా హాజరు కాలేని వారి కోసం, వేలం ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రసారం చేయబడుతుందన్నారు. మర్హబా ఆక్షన్స్ అనేది కార్ వేలం హౌస్. సౌక్ అల్ హరాజ్ - షార్జా ఆటో విలేజ్, షార్జా ఇండస్ట్రియల్ ఏరియా 2లోని రెండు ఆపరేటింగ్ శాఖల నుండి వారానికి ఆరు వేలం నిర్వహిస్తుంది.
తాజా వార్తలు
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం







