‘పుష్ప 2’ ప్యాన్ ఇండియా పాట్లు.!
- May 24, 2023
‘పుష్ప’ సినిమా బాలీవుడ్‌లో అత్యధిక ఆదరణ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. తొలి పార్ట్‌కి వచ్చిన ఆదరణతో రెండో పార్ట్‌ని భారీ స్థాయిలో తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు సుకుమార్ అండ్ టీమ్.
ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమా. కాగా, ఈ సారి నార్త్ జనాల్ని గట్టిగా ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే, బాలీవుడ్ జనాన్ని కూడా ఈ సినిమాలో భాగం చేయాలనుకుంటున్నారనీ తెలుస్తోంది.
ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడ్ని ‘పుష్ప2’ కోసం తీసుకోవాలనుకుంటున్నారట. జస్ట్ కొన్ని సెకన్ల పాటు మాత్రమే వుండే పాత్రట అది. ఇంపార్టెంట్ గెస్ట్‌గా ఆ నటుడికి ఈ సినిమాలో భాగం చేయాలనుకుంటున్నారట.
ఆ లిస్టులో ప్రముఖంగా రణ్ వీర్ కపూర్ పేరు వినిపిస్తోంది. ఈ మధ్య బాలీవుడ్ నటులు టాలీవుడ్ సినిమాల్లో గెస్ట్‌లుగా కనిపించేందుకు అత్యుత్సాహం చూపిస్తున్న సంగతి తెలిసిందే.
జరుగుతున్న ప్రచారం నిజమే అయితే, రణ్‌వీర్ అప్పియరెన్స్ ‘పుష్ప 2’కి ఖచ్చితంగా ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







