అక్కినేని హీరోలకి సమంత అవసరం పడిందా.?
- May 24, 2023
అక్కినేని హీరోలకి ప్రస్తుతం ఏదీ కలిసి రావడం లేదు. అలాగే, అటు సమంతకీ పెద్దగా కలిసి రావడం లేదు. బ్యాక్ టు బ్యాక్ రెండు ఫ్లాప్‌లు చూసింది సమంత.
ఖచ్చితంగా హిట్ కొడతాడనుకున్న నాగ చైతన్య కూడా ‘కస్టడీ’తో ఫ్లాప్ ఇచ్చాడు. ఇక్కడ గమనించాల్సిందేమంటే, సినిమాలతో కన్నా నాగ చైతన్య, సమంతలకు పర్సనల్ లైఫ్‌లో వున్న క్రేజే ఎక్కువ.
అది క్యాష్ చేసుకోవడానికే టాలీవుడ్లో ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ సెట్ చేసేందుకు తెర వెనక మంతనాలు జరుగుతున్నాయట.
ఇటు నాగార్జున కూడా అందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయ్. చై, సామ్ విడాకుల అనంతరం ఈ న్యూస్ గుప్పుగుప్పుమంటున్నా.. ఇప్పుడు ఇంకాస్త ఎక్కువగా వినిపిస్తోంది.
నాగార్జునకు అత్యంత సన్నిహితుడైన ఓ నిర్మాత ద్వారా ఈ ప్రాజెక్ట్‌ని ముందుకు తోస్తున్నాడట నాగార్జున. త్వరలోనే ఫైనల్ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







