కారు బాంబు పేలుళ్లలో 86 మంది మృతి : బాగ్దాద్
- May 11, 2016
కారు బాంబు పేలుళ్లలో 86 మంది మృతి బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో బుధవారం వేర్వేరు చోట్ల జరిగిన మూడు కారు బాంబు పేలుళ్లలో 86 మంది మృతిచెందారు. షీటే ప్రాంతంలో ఉదయం 10 గంటలకు ఓ మార్కెట్ సమీపంలో బాంబు పేలడంతో 64 మంది పౌరులు మరణించగా, మరో 82 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఏడాది బాగ్దాద్‌లో చోటుచేసుకున్న దాడుల్లో ఇదే అతి పెద్ద దాడి. పేలుడు ధాటికి మార్కెట్‌లోని షాపులు, వాహనాలు కాలి బూడిదయ్యాయి. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఘటనా స్థలి దద్దరిల్లింది. ఖదీమియాలో జరిగిన పేలుడులో 14 మంది బలయ్యారు. పశ్చిమ బాగ్దాద్‌లోని జామీమియా లో చోటుచేసుకున్న మరో కారుబాంబు పేలుడులో 8 మంది చనిపోయారు. తామే ఈ దాడులకు పాల్పడినట్లు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్రకటించింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









