నందమూరి రచ్చ: బాలయ్య - ఎన్టీయార్ అభిమానుల లొల్లి.!
- May 25, 2023
నందమూరి అభిమానులు సోషల్ మీడియా వేదికగా కొట్టుకు ఛస్తున్నారు. బాలయ్య ఫ్యాన్స్, ఎన్టీయార్ ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా తయారైంది నెట్టింటి వేదికగా పరిస్థితి.
ఏకంగా ఫ్యామిలీలోని లేడీస్‌ని సైతం ఈ రచ్చలోకి లాగుతూ జుగుప్స కలిగేలా డిస్కషన్స్ చేస్తున్నారు. బాబాయ్ అబ్బాయ్ బాగానే వుంటారు. ఈ అభిమానులే. మధ్యలో దూరి రచ్చ రచ్చ చేస్తుంటారు.
ఎప్పుడూ జరిగేదే ఇది. హీరోలు ఎంత చెప్పినా వినరీ అభిమానులు. తాజాగా బాలయ్యకూ ఎన్టీయార్‌కీ మధ్య నిప్పు లేని పొగ రాజేయడమే పెద్ద పనిగా పెట్టుకున్నట్లుగాన్నారు నందమూరి అభిమానులు.
నందమూరి వారసుడు మా హీరో.. కాదు, కాదు మా హీరో అంటూ కొట్టుకు ఛస్తున్నారు. ఎందుకొచ్చిన రచ్చ ఇదంతా అని ఇతర హీరోల అభిమానులు ఎంత చెప్పినా చెవికెక్కించుకోవడం లేదు. ఇటీవల రిలీజైన ‘సింహాద్రి 4K’ రీ రిలీజ్ ఫ్లాప్ అవ్వడానికి కూడా ఈ రచ్చే పెద్ద రీజన్ అంటున్నారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు
- అంబులెన్స్లో మంటలు నలుగురు మృతి
- ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- లండన్ మ్యూజియంలో అమరావతి శిల్ప సంపదను తెచ్చేందుకు చర్యలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!
- ఖతార్ లో ఆన్లైన్ లో ఖైదీల ఉత్పత్తులు..!!







