‘మళ్లీ పెళ్లి’ని బ్యాన్ చేయాల్సిందే - నరేష్ మూడో భార్య.!
- May 25, 2023
సీనియర్ నటుడు నరేష్, పవిత్రా లోకేష్ జంటగా ‘మళ్లీ పెళ్లి’ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. రేపు అనగా మే 26న ఈ సినిమా రిలీజ్‌కి సిద్ధమైంది.
గత నెల రోజులుగా ఈ సినిమాని తెగ ప్రమోట్ చేస్తున్నారు నరేష్, పవిత్ర లోకేష్. ఎక్కడికక్కడ ప్రత్యేకమైన వేదికలు నిర్వహిస్తూ, ఆయా వేదికలపై వారి వారి లైవ్ రొమాన్స్, రొమాంటిక్ డాన్సింగ్ స్టెప్పులు.. ఇలా పనికిమాలిన పైత్యం చూపిస్తూ చెత్త చెత్త చేస్తున్నారు.
ఇక, రిలీజ్ టైమ్ రానే వచ్చింది. సరిగ్గా ఇదే టైమ్‌లో నరేష్ మూడో భార్య రంగంలోకి దిగింది. ఈ సినిమాలో తనకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను అభ్యంతరకరంగా చూపించారంటూ ఆమె మీడియాకెక్కింది. ఎలాగైనా సినిమాని బ్యాన్ చేయాలని డిమాండ్ చేసింది.
తనకు విడాకులివ్వకుండానే నరేష్, పవిత్రతో కలిసి వుంటున్నాడని ఆమె వాదిస్తోంది. మరి, ఈ వివాదం నరేష్ సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెడుతుందా.? లేక అడ్డంకిగా మారి సినిమా రిలీజ్ కాకుండా ఆపగలుగుతుందా.? చూడాలి మరి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







