తప్పిపోయిన నెల తర్వాత పౌరుడి మృతదేహం లభ్యం..!
- May 27, 2023
కువైట్: ఏప్రిల్ మధ్యలో అదృశ్యమైన కువైట్ పౌరుడు ముబారక్ అల్-రషీది మృతదేహం పశ్చిమ అల్-సల్మీ ప్రాంతంలో లభ్యమైనట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ శుక్రవారం సాయంత్రం తెలిపింది. మొదటి ఉప ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి, రక్షణ మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ అల్-అహ్మద్ అల్-సబాహ్ సూచనల మేరకు.. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ అల్-రషీది గాలింపును చేపట్టింది. ప్రజా భద్రత, ట్రాఫిక్, సెంట్రల్ ఆపరేషన్స్, పెట్రోలింగ్ మరియు హెలికాప్టర్ల విభాగాలతో సహా వందలాది మంది భద్రతా సిబ్బంది, అలాగే వాలంటీర్లు ఈ గాలింపు ప్రచారంలో పాల్గొన్నారు. మరణించిన వ్యక్తి మృతదేహాన్ని కనుగొనే వరకు వారు నిరంతరం శ్రమించారని మంత్రిత్వ శాఖ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ రిలేషన్స్ అండ్ మీడియా ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. అల్-రషీది మరణానికి దారితీసిన ఆధారాల కోసం అన్వేషణను కొనసాగిస్తామని, మృతుల కుటుంబానికి మంత్రిత్వ శాఖ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







