రాహుల్ రామకృష్ణా.! ఏంటిదంతా పబ్లిసిటీ కోసమేనా.!
- May 27, 2023
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో కమెడియన్‌గా పరచయమయ్యాడు రాహుల్ రామకృష్ణ. తెలంగాణా యాసతో తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్న రాహుల్ రామకృష్ణ యూత్‌లో ఓ సెన్సేషనే.
ఆ సెన్సేషన్‌తోనే అప్పుడప్పుడూ సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతూ వుంటాడు. మొన్నా మధ్య తనకు కాబోయే భార్యకు లిప్‌లాక్ ఇచ్చిన ఫోటో లీక్ చేసి, తన పెళ్లి వార్త బయట పెట్టాడు. ఆ రకంగా కొన్నాళ్ల పాటు రాహుల్ రామకృష్ణ వైరల్ అయ్యాడు.
అలాగే, పెళ్లి కాకుండానే తండ్రి అయ్యి మరోసారి వార్తల్లోకెక్కాడు. తాజాగా మనోడు మరోసారి తన ఉనికిని ఇన్నోవేటివ్‌గా చాటుకునే ప్రయత్నం చేశాడు.
అందుకు కారణం ఆయన సోషల్ మీడియాలో పెట్టిన తాజా పోస్టే కారణం. అబ్బో పెద్ద పోస్టే పెట్టాడు కానీ, అసలు మ్యాటరేంటంటే తన ఈ పోస్ట్‌లో హైద్రాబాద్, హిందూ, ముశ్లిం.. అనే పదాలు వాడకమే.
ఇప్పుడీ పోస్ట్ వైరల్ అవుతుండడంతో పాటూ, వివాదాస్పదమవుతోంది కూడా. అసలెందుకు రాహుల్ ఈ టైమ్‌లో ఇలా చేశాడు.? అంటే త్వరలో ఆయన నటించిన ’విమానం‘ సినిమా రిలీజ్కి సిద్ధంగా వుంది.
ఈ నేపథ్యంలోనే సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని ఇలా చేశాడేమో రాహుల్ అని మాట్లాడుకుంటున్నారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







