ప్రబాస్ సినిమాలో విశాల్ హీరోయిన్.!
- May 27, 2023
అప్పుడెప్పుడో విశాల్ హీరోగా నటించిన ’పొగరు‘ సినిమాలో లేడీ విలన్ రోల్ పోషించిన ముద్దుగుమ్మ గుర్తుందా.? పేరు శ్రియా రెడ్డి. హీరోయిన్గానూ పలు చిత్రాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ.
అయితే, విశాల్ తో కలిసి చేసిన ’పొగరు‘ చిత్రం మంచి గుర్తింపు తీసుకొచ్చింది శ్రియా రెడ్డికి. ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. కానీ, ఓటీటీ వేదికగా పలు వెబ్ సిరీస్ లలో శ్రియా రెడ్డి కనిపిస్తోంది.
తాజాగా ప్రబాస్ సినిమాలో శ్రియా రెడ్డి నటించినట్లు తెలుస్తోంది. ప్రబాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతోన్న ’సలార్‘ మూవీలో శ్రియా రెడ్డి ఓ పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఈ పాత్రతో మళ్లీ శ్రియా రెడ్డి ఈజ్ బ్యాక్ ఇన్ మూవీస్.. అనేలా వుంటుందట ఆ పాత్ర. సెప్టెంబర్ 28న ’సలార్‘ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయ్.
ఈ లోపే జూన్ 16న రిలీజ్ కాబోయే ’ఆది పురుష్‘ సినిమా ప్రదర్శించబోయే ధియేటర్లలో ’సలార్‘ గ్లింప్స్ రిలీజ్ చేసే ఆలోచనతో ’సలార్‘ టీమ్ వున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







