ఆకాశంలో ఇంజన్ వైఫల్యం.. దుబాయ్‌కి మళ్లించిన ప్యాసింజన్ విమానం

- May 28, 2023 , by Maagulf
ఆకాశంలో ఇంజన్ వైఫల్యం.. దుబాయ్‌కి మళ్లించిన ప్యాసింజన్ విమానం

యూఏఈ: మిడ్-ఎయిర్ ఎమర్జెన్సీ నేపథ్యంలో బ్యాంకాక్ నుండి ఆమ్‌స్టర్‌డామ్‌కు వెళుతున్న KLM విమానాన్ని అత్యవసరంగా దుబాయ్ కి మళ్లించారు. ఫ్లైట్ KL876 - బోయింగ్ 777-200ER విమానం.. ఇరాన్ మీదుగా ఎగురుతున్న సమయంలో ఇంజన్ లో వైఫల్యం ఏర్పడట్టు పైలెట్లు గుర్తించారు. దీంతో సమీపంలో ఉన్న దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండ్ కావాలని అధికారులు సూచించారు. దీంతో అత్యవసరంగా పైలట్ విమానాన్ని దుబాయ్‌లో ల్యాండ్ చేశాడు. విమానం రాగానే ఎమర్జెన్సీ టీమ్‌లు సహాయక చర్యలు చేపట్టాయి. విమానానికి ఎలాంటి ప్రమాదం జరుగపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.  కాగా, ఈ వారం ప్రారంభంలో వాతావరణ పరిస్థితుల కారణంగా మంగళూరు నుండి బెంగళూరుకు వెళ్లే దేశీయ భారతీయ విమానాన్ని దుబాయ్‌కి మళ్లించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 160 మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com