డాక్టర్ తోట చంద్రశేఖర్ జన్మదిన వేడుకలకు రంగం సిద్ధం
- May 28, 2023
హైదరాబాద్: ఐఏఎస్ అధికారిగా, ప్రజాప్రతినిధిగా తెలుగు ప్రజలతో ఆత్మీయ బంధం పెనవేసుకొని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులుగా ఏపీ అభివృద్ధి, ఏపీ ప్రజల అభ్యున్నతి కోసం అహరహం శ్రమిస్తుస్తున్న డాక్టర్ తోట చంద్రశేఖర్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు కార్యకర్తలు, అభిమానులు సర్వం సన్నంద్ధం చేశారు. ఏపీ శాఖ అధ్యక్షులుగా డాక్టర్ తోట చంద్రశేఖర్ వివిధ జిల్లాల్లో పర్యటించడం, విభజన హామీల అమలు కోసం కేంద్రంపై ఆయన అనుసరిస్తున్న పోరాట పంధాతో రాష్ట్రం నలుమూలలా అభిమానులు ఆకర్షితులయ్యారు.
రాజకీయాల్లో ఎంతో కాలంగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఇచ్చిన ప్రోత్సాహంతో ఏపీలో ఆ పార్టీని మూలమూలలా విస్తరించేందుకు డాక్టర్ తోట చంద్రశేఖర్ కృషిచేస్తున్నారు. ఈ సమర్ధ నాయకత్వ విధానాలతో ప్రభావితులైన అనేకమంది భారత రాష్ట్ర సమితిలో చేరారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మే 28వ తేదీన ఆయన తొలి పుట్టిన రోజు రావడంతో ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. దీంతో గుంటూరులోని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో, హైదరాబాద్ లోని నివాసం వద్దా కోలాహలం నెలకొంది. పెద్దయెత్తున ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఇప్పుటికే పలు జిల్లాల నుంచి తరలివచ్చిన నాయకులతో సందడి వాతావరణ నెలకొంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







