తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు వేగేశ్న వరాలు
- June 02, 2023
హైదరాబాద్: గత 35 సంవత్సరాలుగా దివ్యాంగులకు ఎనలేని సేవలందిస్తున్న వేగేశ్న ఫౌండేషన్, కుంట్లూరు, రంగారెడ్డి జిల్లా వారు, తమ సేవలను, ఇక ముందు, రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపచేయనున్నది.వేగేశ్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ వంశీ రామరాజు, వేగేశ్న ఫౌండేషన్ చైర్ పర్సన్ శైలజ సుంకరపల్లి ఒక పత్రిక ప్రకటనలో తెలియజేశారు. శారీరక దివ్యాంగులైన పిల్లలు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో ఉచితంగా చదువుకొనవచ్చును..అవసరమైన వారికి ఫిజియోథెరపీ, సర్జికల్ కరెక్షన్స్, కృత్రిమ అవయవాలు ఏర్పాటు లాంటి సౌకర్యాలను కూడా వేగేశ్న ఫౌండేషన్ కల్పిస్తున్నది.
అంతేకాకుండా,మానసిక వారికి పిల్లలకు కూడా ఉచిత సేవలందిస్తున్నది.తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో చదువుకుంటున్న దివ్యాంగులైన చిన్నారులకు కావాల్సిన సహకారం అందిస్తుంది.
ఆసక్తి కల వారు వేగేశ్న ఫౌండేషన్ చైర్ పర్సన్ శైలజ సుంకరపల్లి, రంగారెడ్డి జిల్లా, కుంట్లూర్, పెద్ద అంబర్పేట్ మున్సిపల్ పరిధి, వారిని జూన్ 12వ తారీకు తర్వాత సంప్రదించవచ్చును.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







