యూఏఈ స్కామ్ అలెర్ట్: మహ్జూజ్ ఫేక్ వెబ్సైట్లపై హెచ్చరిక
- June 02, 2023
యూఏఈ: వీక్లీ రాఫిల్ డ్రా మహ్జూజ్ తన కస్టమర్లకు హెచ్చరిక జారీచేసింది. మహ్జూజ్ పేరుతో నకిలీ వెబ్సైట్లు వినియోగంలో ఉన్నట్లు గుర్తించామని, తమ కస్టమర్లు అలాంటి సైట్ల పట్లజాగ్రతగా ఉండాలని ఆన్లైన్ స్కామర్లకు వ్యతిరేకంగా నివాసితులను హెచ్చరించింది. హ్యాకర్లు, సైబర్ నేరస్థులు మహ్జూజ్ ను పోలిన వెబ్సైట్లను సృష్టించినట్లు భావిస్తున్నారు. వీటి బారీన పడే బాధితుల వ్యక్తిగత వివరాలను - బ్యాంక్ ఖాతా ఆధారాలతో సహా హ్యాక్ చేస్తాయని హెచ్చరించారు. అధికారిక Mahzooz వెబ్సైట్ www.mahzooz.aeని మాత్రమే ఉపయోగించాలని సూచించింది. లింక్‌పై క్లిక్ చేసే ముందు వెబ్సైట్ URLని ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయాలని కోరింది. www.mahzooz.ae కాకుండా మరే ఇతర వెబ్సైట్లో పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డ్ వివరాలు లేదా ఆర్థిక సమాచారం వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడూ అందించవద్దని హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







