ధోఫర్ ఖరీఫ్ సీజన్: సలాలా విమానాశ్రయంలో పర్యాటకుల రద్దీ..!
- June 02, 2023
మస్కట్: జూన్ 21 నుండి సెప్టెంబరు 21 వరకు సలాలా విమానాశ్రయం అందుకోనున్న మొత్తం షెడ్యూల్డ్ విమానాల సంఖ్య 2,500 కంటే అధికంగా ఉంటుందని ఒమన్ ఎయిర్‌పోర్ట్స్ ప్రకటించింది. ఖరీఫ్ సీజన్ 2023 కోసం సలాలా ఎయిర్పోర్ట్ మొత్తం షెడ్యూల్డ్ విమానాల సంఖ్య 2,679కి చేరుకుంటుందని కంపెనీ ప్రకటించింది. ఇందులో 1,456 దేశీయ విమానాలు, 1,223 అంతర్జాతీయ విమానాలు ఉన్నాయని సలాలా ఎయిర్‌పోర్ట్‌లోని ఒమన్ ఎయిర్‌పోర్ట్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇంజి. జకారియా బిన్ యాకూబ్ అల్ హరాసి తెలిపారు. ఈ టూరిజం సీజన్లో పర్యాటకులను స్వీకరించడానికి వ్యూహాత్మక భాగస్వాముల సహకారంతో సలాలా విమానాశ్రయం ఈ సంవత్సరం సిద్ధమవుతోందని అల్ హరాసి సూచించారు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాల రాజధానులు, ఇతర నగరాల నుండి విమానాశ్రయం 1077 ప్రత్యక్ష విమానాలను అందుకుంటుందని పేర్కొన్నారు. 2023 జనవరి చివరి వరకు అంతర్జాతీయ మరియు దేశీయ విమానాల సంఖ్య 43.1 శాతం పెరిగిందన్నారు. వైవిధ్యమైన సహజ అందాలు, అసాధారణమైన వాతావరణం, పర్యావరణ వైవిధ్యం కారణంగా వేసవి కాలంలో అరేబియా గల్ఫ్ దేశాలలో ధోఫర్ గవర్నరేట్ అత్యంత ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా ఉంటుందని, దీంతో పర్యాటకులు తరలివస్తారని చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







