‘హరి హర వీరమల్లు’ ఇప్పట్లో లేనట్లేనా.?
- June 03, 2023
ఎలక్షన్లు దగ్గర పడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తాను ఒప్పుకున్న ప్రాజెక్టులన్నీ చక చకా షూటింగ్స్ పూర్తి చేసేస్తున్నారు. నిన్న కాక మొన్న పట్టాలెక్కిన హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, సుజిత్ ‘ఓజీ’ కూడా షూటింగ్స్ ఓ కొలిక్కి వచ్చేశాయట.
అయితే, ఎప్పుడో స్టార్ట్ చేసిన ‘హరి హర వీరమల్లు’ మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే వుంది అన్న చందంగా ముందుకు కదలడం లేదంటున్నారు.
అందుకు తెర వెనక రకరకాల కారణాలు గాసిప్స్ రూపంలో చక్కర్లు కొడుతున్నాయ్. క్రిష్ ఈ సినిమా విషయంలో ఏవేవో కిరికిరి చేస్తున్నాడట. అలాగే నిర్మాత కూడా ఎందుకో సైలెంట్ అయ్యాడనీ విన వస్తోంది.
ఈ కారణాలతోనే సినిమా షూటింగ్ ముందుకు జరగట్లేదనీ అంటున్నారు. బహుశా ఎలక్షన్ల లోపల ఈ సినిమా పూర్తయ్యే అవకాశాల్లేవని అంటున్నారు. చూడాలి మరి, ఈ ప్రచారంలో నిజమెంతో.!
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







