నిర్మాణ రంగంలో 152,500కి చేరుకున్న మహిళా ఉద్యోగుల సంఖ్య
- June 04, 2023
రియాద్: నిర్మాణ రంగంలో సామాజిక బీమా నియమాలు, నిబంధనలకు లోబడి ఉన్న కార్మికుల సంఖ్య 2022 నాల్గవ త్రైమాసికం చివరి నాటికి దాదాపు 2.46 మిలియన్ల కార్మికులకు చేరుకుంది. అల్ ఈక్వతేసాదియా (Al-Eqtesadiah) ప్రకారం.. సామాజిక బీమా నిబంధనలకు లోబడి ఉన్న విదేశీ కార్మికులు.. ఈ రంగంలో అత్యధిక శాతం 85.4%(2.1 మిలియన్ల కార్మికులు) కలిగి ఉన్నారు. నిర్మాణ రంగంలో పనిచేస్తున్న సౌదీలు 14.6%(369,600 మంది ఉద్యోగులు) మంది ఉన్నారు. అయితే ఈ రంగంలో మహిళా ఉద్యోగుల సంఖ్య 152,500 మంది ఉద్యోగులకు చేరుకుంది. వీరిలో అత్యధిక శాతం సౌదీ మహిళలు ఉన్నారని నివేదిక తెలిపింది. నిర్మాణ రంగంలో అత్యధిక శాతం కార్మికులు ఉన్న సౌదీ నగరాల విషయానికొస్తే రాజధాని రియాద్ అత్యధికంగా 39.6%(972,600 మంది ఉద్యోగులు) ఉండగా.. ఆ తర్వాత స్థానాల్లో తూర్పు ప్రాంతం (అల్-షార్కియా)లో 648,900 మంది కార్మికులు, మక్కాలో 444,700 మంది ఉద్యోగులు ఉన్నారు.
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్లు
- బీచ్లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి