ఢిల్లీ లో 'నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు'ల ప్రదాన కార్యక్రమం
- May 12, 2016
'నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు'ల ప్రదాన కార్యక్రమాన్ని దేశరాజధాని దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఏర్పాటు చేశారు. నర్సు వృత్తిలో విశేషమైన సేవలు అందించి ఎంతో మందికి సహాయం చేసినందుకు గాను కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ ఈ అవార్డులను అందజేస్తుంది.
ఫ్లొరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుకొంటారు. ఈ సందర్భంగా రోగులకు విశేష సేవలు అందించిన పలువురు నర్సులను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అవార్డును అందజేసి ఘనంగా సత్కరించారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







