గార పట్టిన దంతాలు తెల్లగా ముత్యాల్లా మెరిసిపోవాలంటే.!
- June 08, 2023
దంత సమస్యలన్నీ ఓ ఎత్తు. పళ్లు పసుపు రంగులోకి మారి గార పట్టినట్లుగా కనిపించడం ఇంకో ఎత్తు. అందమైన స్మైల్‌కి ముత్యాల్లా మెరిసే దంతాలూ కీలకమే. గార పట్టిన దంతాలను క్లీన్ చేసుకోవడానికి డెంటిస్ట్ వద్దకు పోతే బోలెడంత ఖర్చుతో కూడుకున్న పని.
ఖర్చు పోతే పోయే.. ఒక్కసారి డెంటిస్ట్ చేతిలో మన గార పళ్లు పడ్డాకా.. వాటికున్న సెన్సిటివిటీ కోల్పోవాల్సి వస్తుంది. ఆ తర్వాత అనేక రకాల దంత సమస్యలు తోడవుతాయ్.
అందుకే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేచురల్ పద్ధతిలోనే గార పట్టిన దంతాలను శుభ్రం చేసుకోవడానికే ఈ స్పెషల్ రెమెడీ. అదేంటో తెలుసుకుందాం పదండి.
ఓ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్‌లో అర టేబుల్ స్పూన్ సాల్ట్ కలిపి అందులో రెగ్యులర్‌గా యూజ్ చేసే టూత్ పేస్ట్ వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. దీనికి కొద్దిగా ఆలివ్ ఆయిల్, రెండు చుక్కల నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని టూత్ బ్రెష్ సాయంతో సున్నితంగా దంతాలను శుభ్రం చేసుకోవాలి.
ఒక్క వాష్‌తోనే చాలా ఫలితం వుంటుంది. ఇలా రెగ్యులర్‌గా చేస్తే, దంతాలకు గార పట్టడం అనే సమస్యే వుండదు. ముత్యాల్లా మెరిసిపోవడం ఖాయం.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







