జమ్మూలో అట్టహాసంగా శ్రీవారి ఆలయ ప్రారంభోత్సవం
- June 08, 2023
జమ్ము: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జమ్ములోని మాజిన్ గ్రామంలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి మందిర ప్రారంభోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన విగ్రహ ప్రతిష్ఠాపన, మహా సంప్రోక్షణ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
62 ఎకరాల ప్రాంగణంలో అందమైన శివాలిక్ అడవుల నిర్మించిన ఈ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం.. జూన్ 3వ తేదీన పుణ్యాహవచనంతో ప్రారంభమైంది. ఆరు రోజుల పాటు వేద పండితుల మంత్రోచ్ఛారణలతో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది.
చివరి రోజైన గురువారం జరిగిన ధ్వజాహరోహణం, సర్వదర్శన ప్రారంభ కార్యక్రమానికి కేంద్రమంత్రి హాజరయ్యారు. శ్రీవారి ఆలయం.. జమ్ము ప్రాంతంలోని అతిపెద్ద దేవాలయాలలో ఒకటిగా నిలిచింది.
గురువారం ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రితోపాటుగా జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, స్థానిక ఎంపీ జుగల్ కిశోర్ శర్మ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జమ్ము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్, ఎస్వీ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ప్రెసిడెంట్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో పాటు వేద పండితులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







