గ్లోబల్ విలేజ్ 28వ ఎడిషన్.. ప్రారంభ తేదీలు ప్రకటన
- June 09, 2023
దుబాయ్: దుబాయ్ గ్లోబల్ విలేజ్ ఈ సంవత్సరం ఒక వారం ముందుగా తెరవబడుతుంది. అక్టోబర్ 18న సీజన్ 28 ప్రారంభం అవుతుంది. ఈ ఫ్యామిలీ థీమ్ పార్క్ 194 రోజుల పాటు సందర్శకులకు తెరిచి ఉంటుంది. 2024 ఏప్రిల్ 28న సీజన్ ముగుస్తుంది. ప్రతి సంవత్సరం పార్క్ శక్తివంతమైన వాతావరణం, ఆకర్షణీయమైన ప్రదర్శనలు, ఆహ్లాదకరమైన వంటకాలు మరియు ప్రత్యేకమైన షాపింగ్ అవకాశాలను తిలకించడానికి ప్రపంచంలోని నలుమూలల నుండి మిలియన్ల మంది సందర్శకులు తరలివస్తారు.
గత ఎడిషన్‌లో గ్లోబల్ విలేజ్ లో 27 పెవిలియన్‌లలో 90 కంటే ఎక్కువ సంస్కృతులను అలాగే 40,000 మంది కళాకారులు 40 వివిధ దేశాల నుండి 400 మంది ప్రదర్శనలను నిర్వహించారు. మునుపటి ఎడిషన్‌లో 27 పెవిలియన్‌లను ఖతార్, ఒమన్, యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్, ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్రికా, అమెరికా, చైనా, ఈజిప్ట్, యూరప్, ఇండియా, ఇరాన్, జపాన్ దక్షిణ కొరియా, లెబనాన్, మొరాకో, పాకిస్థాన్, పాలస్తీనా, సిరియా, థాయిలాండ్, టర్కీ, యెమెన్ మరియు రష్యా ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







