బరువు తగ్గడానికి ఆ ప్రత్యామ్నాయాల్ని వినియోగిస్తున్నారా.?

- June 10, 2023 , by Maagulf
బరువు తగ్గడానికి ఆ ప్రత్యామ్నాయాల్ని వినియోగిస్తున్నారా.?

బరువు పెరగడానికి చక్కెర కూడా ఓ ప్రధాన కారణంగా చెబుతుంటారు. మితి మీరిన చక్కెర వినియోగం వేస్ట్ కొలెస్ర్టాల్‌తో పాటూ, బరువు పెరగిపోవడానికీ దోహదం చేస్తుంది.
అందుకే చక్కెరను వీలైనంత తక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. అయితే, చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఈ మధ్య అనేక రకాల స్వీట్‌నర్స్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయ్.
ప్యాకింగ్ రూపంలో అందుబాటులో వున్న ఈ తరహా చక్కెర ప్రత్యామ్యాయాలను వినియోగించడం ఎంత ప్రమాదకరమో ఈ మధ్య WHO ఓ ప్రణాళిక ద్వారా సూచించింది.
ప్రీ షుగర్ ఎలిమెంట్స్ బరువు తగ్గడానికి ఎంత మాత్రమూ సహాయపడవు సరికదా.. దీర్ఘ కాలంగా అనేక వ్యాధులకు కారణమవుతాయ్. టైప్ 2 మధుమేహం, హృదయ సంబంధిత వ్యాధులు, పెద్దల్లో అయితే, ప్రాణాంతక వ్యాధుల ప్రమాదం.. అలాగే అవాంఛనీయ ప్రభావాలకు కూడా దారి తీస్తుందని ఆ ప్రణాళికలో WHO సూచించింది. 
ఈ స్వీట్‌నర్స్‌లో చక్కెర తక్కువ వుంటుంది తద్వారా కేలరీలు తక్కువగా వుంటాయ్ అలాగేచ పోషకాలు అధికంగా వుంటాయ్ అని చాలా మంది నమ్ముతుంటారు. కానీ, అందులో ఎంతమాత్రమూ నిజం లేదని న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సేప్టీ నిపుణులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com