మోక్షజ్ఞ ఎంట్రీ షురూ.! డైరెక్టర్ ఎవరంటే.!
- June 12, 2023
ఇటీవల బాలయ్య పుట్టినరోజు సందర్భంగా మోక్షజ్ఞ ఎంట్రీ సోషల్ మీడియాలో సందడి చేసిన సంగతి తెలిసిందే. మోక్షజ్ఞకు సంబంధించిన ఫోటోలు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తుంటాయ్. బాలయ్య బర్త్డే సందర్భంగా మోక్షజ్ఞ ఫోటోలు కొన్ని సడెన్గా సోషల్ మీడియాలో సందడి చేశాయ్.

కొంతమంది అభిమానులతో కలిసి నవ్వుతూ ఫోటోలకి పోజిచ్చాడు మోక్షజ్ఞ. దీనర్ధం త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ షురూ కాబోతోందనీ, అందుకు సాక్ష్యం ఈ ఫోటోలే అన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
ఈ ఫోటోల్ని నందమూరి అభిమానులు తెగ ట్రెండింగ్ చేశారు కూడా. ఇక, ఈ తాజా ఫోటోల్లో మోక్షజ్ఞ లుక్స్ బాగున్నాయ్. గతంతో పోల్చితే, ఫిట్నెస్ లెవల్స్ కూడా ఓకే. హీరోయిజం కాస్త ఎలివేట్ అవుతోంది.. అనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయ్.
మొత్తానికి త్వరలోనే నందమూరి వారసుడు ఆరంగేట్రానికి రంగం సిద్ధమవుతున్న సూచనలు భాలయ్య తాజా పుట్టినరోజు వేడుకల సందర్భంగా ప్రూవ్ చేశారు. అయితే, వారసుడ్ని పరిచయం చేసే అవకాశం టాలీవుడ్ దిగ్గజ దర్శకుల్లో ఎవరికి దక్కుతుందా.? అంటే ఆ లిస్టులో బోయపాటి శీను పేరు, అనిల్ రావిపూడి పేరు ప్రముఖంగా వినిపిస్తున్నాయ్.
తాజా వార్తలు
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి
- ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- 13 సంస్థలపై SR37 మిలియన్ల జరిమానా..!!
- రెండు దేశాలతో ఎయిర్ సర్వీసులకు సుల్తాన్ ఆమోదం..!!







