కృతి శెట్టితో వెంకట్ ప్రభు ప్రయోగం.?
- June 12, 2023
తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించిన ‘కస్టడీ’ సినిమా ఇటీవల ధియేటర్లలో సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే, ధియేటర్ ప్రేక్షకుల్ని సరిగా ఆకట్టుకోలేకపోయింది ‘కస్టడీ’.
రీసెంట్‌గా ఓటీటీలో ‘కస్టడీ’ని రిలీజ్ చేశారు మేకర్లు. అయితే, ఓటీటీ ప్రేక్షకుల్ని ధియేటర్‌తో పోల్చితే, ఒకింత బాగానే ఆకట్టుకుంది ‘కస్టడీ’.
నాగా చైతన్య పర్‌ఫామెన్స్, కృతి శెట్టి క్యూట్‌నెస్ అదరహో అనకపోయినా.. వారి వరకూ వారు బాగానే చేశారన్న కామెంట్స్ వస్తున్నాయ్ ఓటీటీ ప్రేక్షకుల నుంచి.
ముఖ్యంగా కృతి శెట్టిని ఈ సినిమా తర్వాత తెగ ఆడి పోసుకున్నారు. కానీ, ఈ సినిమాలో కృతి శెట్టికి గత సినిమాలతో పోల్చితే మంచి ప్రాధాన్యత గలిగిన పాత్ర దక్కింది. ఆ పాత్రలో కృతి శెట్టి నూటికి నూరు మార్కులు వేయించుకుంది.
ఈ సినిమాతో డైరెక్టర్ వెంకట్ ప్రభుకి కృతి బాగా క్లోజ్ అయిపోయిందట. ఆమె టాలెంట్‌ని గుర్తించిన వెంకట్ ప్రభు కృతి శెట్టితో ఓ ప్రయోగాత్మక చిత్రం తీయబోతున్నాడనీ తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- 13 సంస్థలపై SR37 మిలియన్ల జరిమానా..!!
- రెండు దేశాలతో ఎయిర్ సర్వీసులకు సుల్తాన్ ఆమోదం..!!
- కువైట్ లో కొత్త రెసిడెన్సీ ఉల్లంఘన జరిమానాలు..!!
- ICRF ఫేబర్-కాస్టెల్ స్పెక్ట్రమ్ క్యాలెండర్ 2026 ఆవిష్కరణ..!!
- దుబాయ్ లో ఆ 4 బీచ్‌లు ఫ్యామిలీల కోసమే..!!
- ఇండిగో పైలట్ రిక్రూట్మెంట్లో భారీ మార్పులు
- మల్కాజిగిరి తొలి కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతి
- తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం
- ఇక పై వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్..







