ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఉద్యోగాలు...
- June 13, 2023
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) రాయపూర్ లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 169 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మెడికల్ ఆంకాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, పెడియాట్రిక్స్ వంటి విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ, ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 45 ఏళ్లు మించరాదు.
అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 67,700 జీతంగా చెల్లిస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు 10 జులై 2023ని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.aiimsraipur.edu.in/ పరిశీలించగలరు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







