ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- December 27, 2025
హైదరాబాద్: ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకలు గండిపేటలో ఘనంగా జరిగాయి. ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..విద్యార్థులందరికీ అభినందనలు.ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వార్షిక ఉత్సవాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది.విద్యార్థులకు అధ్యాపకులకు నిర్వాహకులకు అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు. గండిపేటకు వస్తే నాకు చాలా జ్ఞాపకాల గుర్తుకొస్తాయి. గండిపేట ఒకప్పుడు రాజకీయ కేంద్రం పార్టీ హెడ్ క్వార్టర్స్.ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఈ హెడ్ క్వార్టర్స్ లో పనిచేసిన తర్వాత, నేను కూడా కొన్ని రోజులు ఇక్కడ పని చేశాను. ఒకప్పుడు రాజకీయ నాయకులకు శిక్షణ ఇచ్చిన కేంద్రం ఇది. ఇప్పుడు చిన్నారులందరికి శిక్షణ ఇచ్చే కేంద్రం. ఇక్కడ చాలా శిక్షణ కేంద్రాలు పెట్టాం ఇప్పుడు మీరు చదువుకుంటున్న తరగతులన్నీ అప్పుడు రాజకీయ నాయకులకు శిక్షణ తరగతులు.
1997 ఫిబ్రవరి 15న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేశాం. 2005 జూన్ 23న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రారంభించాం.కొన్ని కారణాలవల్ల పేరెంట్స్ చనిపోయి, పిల్లలు అనాధలు అయిపోతే ఆ పిల్లలకు పెద్దదిక్కుగా ఉండాలి వారికి ఏ లోటు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇక్కడ బ్రహ్మాండమైన బిల్డింగులు నిర్మించుకున్నాం. ఆరోజు చిన్న మొక్క ఈరోజు మహా వృక్షం అయింది.
నేను చేసింది ఒక ఎత్తు, భువనేశ్వరి చేసింది మరో ఎత్తు. భువనేశ్వరిని అభినందించాలి.మొదట జూనియర్ కాలేజ్ పెట్టారు.తర్వాత డిగ్రీ కాలేజ్ పెట్టారు. దీనిని సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఘనత శ్రీమతి భువనేశ్వరి గారిది. గ్రూప్ వన్ పరీక్షల్లో ఇక్కడ ఉండే నలుగురు పాసయ్యారు, ముగ్గురు జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికయ్యారు. ఐఐఎం ట్రిబుల్ ఐటీ, ఐఐటీలో 29 మందికి సీట్లు వచ్చాయి. ఈ సీట్లు వచ్చిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.
నేను మొట్ట మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాదులో ఐటీ ప్రారంభించాం. హైటెక్ సిటీ తో ప్రారంభమైంది.ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తో ప్రారంభమై 9 ఏళ్లలో 300 ఇంజినీరింగ్ కాలేజీలు వచ్చాయి. ప్రపంచంలో ఎవ్వరు చదువుకోవాలన్నా హైదరాబాద్ కి వచ్చే పరిస్థితి వచ్చిందంటే అది ఆరోజు చూపించిన చొరవ. రాజకీయాల్లో ఉండే మేము నీతి నిజాయితీగా ఉండాలి గౌరవప్రదంగా ఉండాలంటే కుటుంబానికి వ్యాపారం ద్వారా వ్యవసాయం ద్వారా ఆదాయం రావాలి తప్ప రాజకీయాలపై ఆధార ఆధార పడకూడదని ఆరోజు హెరిటేజ్ ఫుడ్స్ పెట్టాం.
పిల్లలందరికీ ఒక విజన్ ఉండాలి.నేను కాలేజీల్లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను. కాలేజీ యూనివర్సిటీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఎమ్మెల్యేగా గెలిచి రెండు సంవత్సరాల్లో మంత్రి అయ్యాను. అక్కడి నుంచి చరిత్ర అంతా మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నాలుగో సారి ముఖ్యమంత్రిగా ఉన్నాను.ఎన్నిసార్లుగా ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నానని కంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగిందనేది చాలా ముఖ్యం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రెండు సంవత్సరాల్లో మినిస్టర్ అయ్యాను. అప్పుడు లోకేష్ చిన్న పిల్లాడు హెరిటేజ్ పనులు చూసుకోమని భువనేశ్వరికి చెప్పాను. తను కొంత అష్టంగానే ఒప్పుకున్నారు. ఆ తర్వాత నేను హెరిటేజ్ ని పట్టించుకోలేదు. సమర్థవంతంగా పనిచేసే హెరిటేజ్ వ్యవస్థని కంపెనీని బ్రహ్మాండంగా నడిపించిన వ్యక్తి భువనేశ్వరి. పట్టుదల ఎలా వస్తుందని అనేదానికి ఇది ఒక ఉదాహరణ.
ప్రపంచంలో ఎన్ని టెక్నాలజీలు ఉన్నాయో వాటిని చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ని తయారు చేయాలని నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీకి వెళ్లాను.భువనేశ్వర్ కి వాళ్ళ నాన్నగారు లాగా పట్టుదల మొండితనం ఉంది. ఏదైనా పట్టుకుంటే సమర్థవంతంగా విజయవంతంగా చేస్తారు. భువనేశ్వరి విషయంలో నేను గర్వపడుతున్నాను.లండన్ లో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు వచ్చాయి. తనలో ఎప్పుడూ ఇంకా ఏదో చేయాలనే తపన ఆలోచన ఉంటుంది.రానున్న రోజుల్లో ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ని వన్ అఫ్ ద బెస్ట్ ఎక్స్ లెన్స్ ఇన్స్టిట్యూట్ గా తయారు చేసే బాధ్యత కూడా భువనేశ్వర్ తీసుకుంటున్నారు.ఇక్కడ చదివి శిక్షణ పొందిన వందమందికి పైగా విద్యార్థులు ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదువుతున్నారు ఇక్కడి నుంచి జడ్జిలోస్తున్నారు దానికి నేను గర్వపడుతున్నాను.
ఎన్టీ రామారావు గారు సమాజంలో సమానత్వం కోసం విద్యా సామాజిక న్యాయం వీటన్నిటి కోసం పోరాడిన వ్యక్తి దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ట్రస్ట్ పెట్టి చదువు చెప్పిన దాఖలాలు లేవు. అలాంటి ఏకైక సంస్థ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్.అనేక అనేక రకమైన ఆరోగ్య సేవలు అందిస్తున్నాం.పది లక్షల మందికి రక్తదానం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా జరిగింది. తలసేమియా బాధిత చిన్నారులకు ఉచిత రక్త మార్పిడి చేయడమే కాకుండా దీనికోసం ఒక ర్యాలీ కూడా పెట్టి సంఘీభావం తెలపడం జరిగింది.సంజీవిని క్లినిక్ ద్వారా 22 లక్షల మందికి 23 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు చేసి ఆరోగ్య సేవలు అందించారు. కోవిడ్ సమయంలో మూడు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసి కోటి రూపాయలు ఆర్థిక సాయం చేశారు. వరదలు వచ్చినా తుఫానులు వచ్చిన ప్రకృతి విపత్తుల్లో 22 లక్షల మందికి సహాయం చేశారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా నాలుగు లక్షల 80 వేల మందికి స్వచ్ఛమైన నీరు అందిస్తున్నారు. మొన్ననే ఒక మారుమర గిరిజన ప్రాంతంలో 1600 మందికి వైద్య సేవలు అందించి వచ్చారు.
1995లోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నాం.ఈరోజు భారత ఆర్థిక వ్యవస్థని మార్చేసే పరిస్థితి వచ్చింది హైయెస్ట్ పెర్ క్యాపిట ఇన్కమ్ కి చిరునామా ఒక తెలుగు వాడు కావడం నాకెంతో సంతోషంగా ఉంది.అందరూ మోడరన్ టెక్నాలజీ అలవాటు చేసుకోవాలి గ్లోబల్ నాలెడ్జ్ ని అధ్యయనం చేసుకోవాలి.మన విలువల్ని మనం కాపాడుకుంటూ నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోవాలి.అలా చేస్తే మనం అనుకున్నది సాధించలేనిది ప్రపంచంలో ఏదీ లేదు. జీవితాలు గొప్పగా మారాలంటే విలువైన ఆయుధం చదువు. ఇది మనం చేయగలిగితే సంపద ఆటోమేటిక్ గా సృష్టించవచ్చు.
భువనేశ్వరి ఈ ఇన్స్టిట్యూట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లడానికి ప్రణాళికలు చేస్తున్నారు.మేనేజ్మెంట్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.దేశం మెచ్చే విధంగా హైదరాబాదులో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ని తయారు చేసే బాధ్యత మీరు తీసుకోండి. ఇది సాధ్యం అవుతుంది.
విద్యార్థుల పైనే నా ఆశలు 2047 వికసిత్ భారత్ మనం తయారు చేసుకోబోతున్నాం. మనది నాలుగో పెద్ద ఆర్థిక వ్యవస్థ.రెండు మూడు సంవత్సరాల్లో మూడో ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 2038కి రెండో ఆర్థిక వ్యవస్థగా మారుతాం. 47 కి ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా కావడమే కాకుండా భారతీయులు ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఉండే అవకాశం ఉంది.పిల్లలు ఇప్పటినుంచే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఒక విజన్ పెట్టుకోండి.దాని కోసం పనిచేయండి.ఇక్కడున్న పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా చేయడానికి నేను కూడా అన్ని రకాలుగా సహకరిస్తారని హామీ ఇస్తున్నాను.
విజన్ 2020ని 2010లో రిలీజ్ చేశాం,ఈరోజు ఆ విజన్ కంటే బెటర్ గా హైదరాబాద్ తయారయింది. ఇప్పుడు 2047 విజన్ తో ముందుకు వెళ్తున్నాం. ఆనాటికి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు నెంబర్ వన్ గా ఉండాలని నా ఆకాంక్ష. తప్పకుండా జరుగుతుంది. అది జరగాలంటే ఈ పిల్లలే దానికి సాధకులు.
ఈ విద్యాసంస్థలు చదివిన ప్రతి ఒక్కరూ మీకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చి ఎన్టీఆర్ ట్రస్ట్ యొక్క బ్రాండ్ పెరగాలి. చాలామంది ఇక్కడ చదువుకున్నాం. ఇది లాభాపేక్షతో పెట్టిన విద్యా సంస్థ కాదు.మానవ వనరులు తయారు చేయడానికి పెట్టిన సంస్థ. ఇక్కడ చదువుకున్న వాళ్ళు తిరిగి రండి, మీ జూనియర్స్ లో స్ఫూర్తినింపండి. మీ సక్సెస్ స్టోరీ చెప్పండి. మీకు తోచిన విధంగా వారిని కూడా పైకి తీసుకోవడానికి ప్రయత్నించండి. మేనేజ్మెంట్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. ఇంకా చేయాలని కోరుతున్నాను. నాలెడ్జ్ ఎవరి సొత్తు కాదు. తెలివైనవారు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక అద్భుతమైన వేడుక. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు పాత రోజులన్నీ గుర్తొచ్చాయి. భువనేశ్వరి గారిని మేనేజ్మెంట్ ని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. విద్యార్థులు అందరికీ అభినందనలు.
ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, వేదికపై ఉన్న పెద్దలకు, అతిథులకు, పేరెంట్స్ కి, స్టూడెంట్స్ కి అందరికీ ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యాన్యువల్ డే కి స్వాగతం. ఎన్టీఆర్ ట్రస్ట్ విజనరీ నందమూరి తారక రామారావు ఆశయాలతో ముందుకు వెళుతుంది. మానవసేవే మాధవ సేవ ఎన్టీఆర్ ట్రస్ట్ నినాదం. మేము ఎన్నో సేవా కార్యక్రమాల్ని చేస్తున్నాం.ఆరోగ్య శిబిరాలు ద్వారా లక్షలాది మందికి వైద్య సేవలు అందిస్తున్నాం. మహిళల కోసం స్త్రీ శక్తి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళుతున్నాం. తలసెమియా కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. డిజాస్టర్ మ్యానేజిమెంట్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడూ ముందడుగులో ఉంటుంది. అలాగే స్కిల్ డెవలప్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది. ఎన్టీఆర్ సుజల కార్యక్రమం ద్వారా సురక్షిత మంచినీరుని అందిస్తున్నాం. మా విద్యార్థులు అందరూ కూడా చదువుల్లో ఆటల్లో రీసెర్చ్ లో టెక్నాలజీలో కమ్యూనిటీ సర్వీస్ లో ముందంజలో ఉన్నారు. ఇక్కడ ప్రతి విద్యార్థి మాకు ఎంతో ప్రత్యేకం. కొందరు నాలెడ్జ్ తో ఇంకొందరు క్రియేటివిటీ తో,నాయకత్వ లక్షణాలతో రాణిస్తున్నారు. మా విద్యార్థులని అద్భుతంగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. ఈ ఏడాది ఎంతో అద్భుతంగా గడిచింది. విద్యార్థులందరికీ నా అభినందనలు. విద్యార్థి విద్యార్థుల జీవితాలు అద్భుతంగా వెలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
తాజా వార్తలు
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మహిళా కమిషన్ విచారణలో శివాజీ క్షమాపణలు
- బ్యాంక్ సెలవుల జాబితా విడుదల
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!







