యూఏఈ లో నిరుద్యోగ బీమా నమోదుకు కొత్త గడువు
- June 15, 2023
యూఏఈ: నిరుద్యోగ భీమా కోసం నమోదు చేసుకోనందుకు కొత్త గడువును మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) ప్రకటించింది. జరిమానాలు విధించేందుకు గతంలో జూలై 1ని తుది గడువుగా పేర్కొనగా.. తాజాగా అక్టోబర్ 1కు పొడిగించారు. మంత్రిత్వ శాఖ ప్రకారం.. పౌరులు, నివాసితులు అందరూ నమోదు చేసుకోవడానికి పథకం ప్రయోజనాలను ఆస్వాదించడానికి వీలుగా చివరి తేదీని పొడిగించినట్లు వెల్లడించింది. రిజిస్టర్ చేసుకోనందుకు జరిమానా 400 దిర్హామ్ అని రిమైండర్ కూడా జారీ చేసింది. ఉద్యోగులు వెబ్‌సైట్ http://iloe.ae , iloe స్మార్ట్ అప్లికేషన్, కియోస్క్ పరికరాలు, ATMలు, వ్యాపార సేవా కేంద్రాలు, మార్పిడి కంపెనీలు (అల్ అన్సారీ ఎక్స్ఛేంజ్ వంటివి), బ్యాంకింగ్ అప్లికేషన్లు, టెలికాం కంపెనీల బిల్లు మరియు టెక్స్ట్ సందేశాల ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే
- తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం
- టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది
- టీ20 సిరీస్ టీమిండియాదే
- మేరీల్యాండ్లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు
- ముసాందంలో వరదల్లో డ్రైవింగ్.. డ్రైవర్ అరెస్ట్..!!
- అత్యున్నత పురస్కారాల్లో ప్రధాని మోదీ రికార్డు..!!
- ఏనుగు సజీవ దహనం..ముగ్గురు అరెస్ట్..!!
- 72 మిలియన్ గ్యాలన్ల రెయిన్ వాటర్ తొలగింపు..!!
- మెచ్యూరిటీ ఇండెక్స్ 2025లో సౌదీకి రెండో స్థానం..!!







