ఎయిర్‌బస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనుగోలు చేయనున్న ఇండిగో ఎయిర్‌లైన్స్
- June 19, 2023
న్యూఢిల్లీ: ప్రైవేట్ విమానయాన సంస్ధ ఇండిగో 500 ఎయిర్‌బస్ ఏ320 ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనుగోలు చేయనుంది. ఇది విమానయాన చరిత్రలో అతిపెద్ద ఒప్పందంగా మెగా ఏవియేషన్ డీల్ నిలవనుంది. 5500 కోట్ల డాలర్ల విలువైన ఈ ఒప్పందం పౌర విమానయాన రంగంలో అతిపెద్ద ఆర్డర్‌గా నమోదైంది. ఇండిగో చీఫ్ పీటర్ ఎల్బర్స్ ఈ చారిత్రాత్మక డీల్ వివరాలను సోమవారం ప్రకటించారు.
గత కొద్దిరోజులుగా ఈ భారీ డీల్‌పై ఎయిర్‌బస్, ఇండిగో జరుపుతున్న చర్చలు ఫలవంతమయ్యాయి. ఇండిగో డీల్‌తో పాటు ఎయిర్‌బస్ సౌదీ ఎయిర్‌లైనర్ ఫ్లైనాస్ కోతో కూడా ప్రతిష్టాత్మక ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు కసరత్తు సాగిస్తోందని బ్లూమ్‌బర్గ్ న్యూస్ వెల్లడించింది.
కాగా, ఈ ఒప్పందాలకు సంబంధించి అధికారిక ప్రకటనలను అందించేందుకు ఎయిర్‌బస్, ఇండిగో, ఫ్లైనాస్ ప్రతినిధులు నిరాకరించారు. ఇండిగో, ఎయిర్‌బస్ భారీ ఒప్పందానికి సంబంధించి పూర్తి వివరాలు వెలుగుచూడాల్సి ఉంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







