హైదరాబాద్‌లో నూతన ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన SBI జనరల్ ఇన్సూరెన్స్
- June 19, 2023
హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ బీమా కంపెనీలలో ఒకటైన SBI జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, తెలంగాణ, కర్ణాటక, అమరావతిలలో తన ఉనికిని బలోపేతం చేసే ప్రయత్నంలో ఉంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో తన కొత్త ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించింది. SBI జనరల్ ఇన్సూరెన్స్ MD & CEO కిషోర్ కుమార్ పోలుదాసు, SBI – హైదరాబాద్ సర్కిల్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ జింగ్రాన్, SBI – అమరావతి సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ నవీన్ చంద్ర ఝా సమక్షంలో ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు.
హైదరాబాద్‌లో ఈ కొత్త ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించడం ద్వారా, బీమా అవగాహనను బలోపేతం చేయడం, దాని పరిధిని విస్తరించడం లక్ష్యంగా కంపెనీ ముందుకు సాగుతుందని ప్రతినిధులు అన్నారు. ఈ కార్యాలయం మూడు రాష్ట్రాల్లో వివిధ ఛానెల్‌లు, లైన్స్ ఆఫ్ బిజినెస్ (LoBs)కి కేంద్ర బిందువుగా పనిచేస్తూ, సజావు సమన్వయం, మెరుగైన కస్టమర్ సేవను అందిస్తుందని తెలిపారు. ఈ వ్యూహాత్మక చర్య హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లోని వ్యక్తులు, వ్యాపారుల జీవితాలను ఆస్తులను సురక్షితం చేయడంలో SBI జనరల్ యొక్క అంకితభావాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







