బహ్రెయిన్‌లో మొదటి సహజ ముత్యాల వేలం
- June 20, 2023
బహ్రెయిన్: మొదటిసారిగా బహ్రెయిన్ సహజ ముత్యాల అంతర్జాతీయ వేలం నిర్వహించనుంది. ఈ చారిత్రాత్మక వేలం మనామాలోని బహ్రెయిన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో ఉన్న బహ్రెయిన్ ఇన్స్టిట్యూట్ ఫర్ పెరల్స్ అండ్ జెమ్‌స్టోన్స్ ప్రధాన కార్యాలయంలో జరుగుతుంది. జూన్ 7న అమెరికాలో రాపాపోర్ట్ గ్రూప్ ప్రారంభించిన వేలం ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్ లోపల, వెలుపల వివిధ నగరాల్లో నిర్వహించారు. ముత్యాల సేకరణ, గ్రేడింగ్, సర్టిఫై చేయడంతోపాటు సహజమైన ముత్యాలను కోనుగోలు చేయవచ్చు. దానత్ ఇన్‌స్టిట్యూట్ సీఈఓ నూరా జంషీర్ మాట్లాడుతూ.. సహజ ముత్యాల మార్కెట్ వృద్ధిని పెంపొందించేందుకు రాపాపోర్ట్ ఇంటర్నేషనల్ గ్రూప్‌తో కలిసి పనిచేయాలని తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







