తన కుమార్తె ఫస్ట్‌లుక్‌ను షేర్ చేసిన షేఖా లతీఫా
- June 20, 2023
యూఏఈ: దుబాయ్ కల్చర్ అండ్ ఆర్ట్స్ అథారిటీ చైర్పర్సన్ షేఖా లతీఫా బింట్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తన నవజాత కుమార్తె మొదటి చిత్రాన్ని ప్రపంచంతో పంచుకున్నారు. గత నెలలో జన్మించిన ఆమె కుమార్తెకు హింద్ బిన్ ఫైసల్ అని పేరు పెట్టారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె తన భర్త ఫైసల్ బిన్ సుల్తాన్ అల్ ఖాసిమీతో కలిసి ఉన్న తన నవజాత కుమార్తె చిత్రాన్ని పంచుకుంది. షేక్ లతీఫా షేక్ ఫైసల్ బిన్ సౌద్ బిన్ ఖలీద్ అల్ ఖాసిమిని 2016లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు జూలై 2018లో ఓ బాబు జన్మించాడు. 2020 అక్టోబర్ లో రెండవ సంతానంగా పాప జన్మించింది. ఆమె సోదరుడు, దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా ఈ ఏడాది ఫిబ్రవరిలో తన మూడవ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







