టైటానిక్-ఎక్స్‌ప్లోరింగ్ సబ్‌మెర్సిబుల్‌లోనే హమీష్ హార్డింగ్
- June 21, 2023
యూఏఈ: యూఏఈ నివాసి హమీష్ హార్డింగ్ తప్పిపోయిన టైటానిక్-ఎక్స్‌ప్లోరింగ్ సబ్‌మెర్సిబుల్‌లో ఉన్నాడని అతని కుటుంబం, యాక్షన్ ఏవియేషన్ సంస్థ ధృవీకరించాయి. ఈ కీలక సమయంలో సహాయం అందించడానికి ముందుకువచ్చిన వ్యక్తులు, సంస్థలకు యాక్షన్ ఏవియేషన్, హార్డింగ్ కుటుంబం ధన్యవాదాలు తెలియజేశారు. “మా గౌరవనీయమైన చైర్మన్ హమీష్ హార్డింగ్ ప్రస్తుతం టైటానిక్ సైట్‌లో టైటాన్ సబ్‌మెర్సిబుల్‌లో ఉన్నట్లు యాక్షన్ ఏవియేషన్ ధృవీకరిస్తోంది. రెస్క్యూ ప్రయత్నాలలో సహాయానికి దిగిన అధికారులు , సంస్థల నిరంతర ప్రయత్నాలకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మేము వారి నైపుణ్యంపై గొప్ప నమ్మకాన్ని ఉంచాం. హార్డింగ్ సురక్షితంగా తిరిగి రావడం కోసం ఎదురుచూస్తున్నాం. ”అని యాక్షన్ ఏవియేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మార్క్ బట్లర్ ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రసిద్ధ టైటానిక్ శిధిలాలను చూడటానికి వెళ్లిన సబ్‌మెర్సిబుల్ లో 58 ఏళ్ల హార్డింగ్ తోపాటు మరో నలుగురు ఉన్నారని సమాచారం. వీరు ప్రయాణించిన సబ్‌మెర్సిబుల్ న్యూఫౌండ్‌లాండ్ తీరంలో ఆదివారం తప్పిపోయింది. “కెప్టెన్ హమీష్ హార్డింగ్, లైసెన్స్ పొందిన ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ పైలట్. మూడు గిన్నిస్ వరల్డ్స్ రికార్డ్స్ హోల్డర్. ఎక్స్‌ప్లోరర్, ఎంటర్‌ప్రెన్యూర్, అసామాన్యమైన నిష్ణాతుడైన వ్యక్తి. వన్ మోర్ ఆర్బిట్ ప్రాజెక్ట్ (ప్రపంచం యొక్క రికార్డ్-బ్రేకింగ్ ప్రదక్షిణ), కమర్షియల్ ఆస్ట్రోనాట్ (NS-21 మిషన్)గా బ్లూ ఆరిజిన్ న్యూ షెపర్డ్ రాకెట్‌తో అంతరిక్ష యానం చేసారు. మరియానా ట్రెంచ్‌లోని ఛాలెంజర్ డీప్‌కు సబ్‌మెర్సిబుల్‌లో వెళ్లివచ్చారు. అనేక సార్లు దక్షిణ ధృవ యాత్రలు చేశాడు. ”అని మార్క్ బట్లర్ వివరించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







