ఐరాసా నుంచి ప్రపంచానికి ప్రధాని మోదీ ‘యోగా డే’ సందేశం
- June 21, 2023
అమెరికా: భారతదేశంలో పురాతన సంప్రదాయమైన యోగాకి కాపీరైట్లు, పేటెంట్లు లేవని.. రాయల్టీ చెల్లింపులు లేకుండా ఉచితంగా అందరికీ చేరుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం యోగా డే సందర్భంగా ఆయన అమెరికాలో ఉన్న ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. యోగా అనేది వయసు, లింగ బేధం లేకుండా అందరికీ ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని ఇస్తుందని మోదీ చెప్పుకొచ్చారు. యోగా నేడు విశ్వవ్యాప్తమైందని, ప్రపంచ నలుమూలలా వ్యాపించిందని అన్నారు.
కాగా, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అతి ఎక్కువ దేశాలు పాల్గొని ప్రపంచ రికార్డు సృష్టించింది. దీంతో గిన్నీస్ ప్రపంచ రికార్డు వారు.. ఐక్య రాజ్య సమితిలో భారత ప్రతినిధికి ఈ విషయమై గుర్తింపు పత్రాన్ని అందజేశారు. యోగా డేకి వచ్చిన అతిథులతో కలిసి ప్రధాని మోదీ యోగా చేశారు. యోగా అనేది ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటమే కాకుండా, మనతో, పరస్పరం దయగా ఉండేందుకు వినియోగించాలని ప్రపంచ దేశాలకు మోదీ పిలుపునిచ్చారు. స్నేహం, శాంతియుత ప్రపంచం, పరిశుభ్రమైన, పచ్చటి, స్థిరమైన భవిష్యత్తుకు యోగా ఉపకరిస్తుందని అన్నారు. ఒకే భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు లక్ష్యాన్ని సాధించడానికి అందరూ చేతులు కలపాలని మోదీ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







