పలు ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం జగన్
- June 22, 2023
అమరావతి: ఏపీలో మరో రూ.1425 కోట్ల పెట్టుబడులు సాకారం అవుతున్నాయి. పలు ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.క్రిబ్కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, విశ్వసముద్ర బయో ఎనర్జీ, సీసీఎల్ పుడ్ అండ్ బెవరేజెస్ పరిశ్రమలకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ సంస్ధను ప్రారంభించారు.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..శంకుస్ధాపన చేసిన ప్లాంట్లన్నీ కూడా త్వరలో నిర్మాణం అవుతాయని ఆయన అన్నారు. ''ఒక్క ఫోన్ కాల్ దూరంలో మీకు అందుబాటులో ఉంటామన్న విషయాన్ని దఅష్టిలో పెట్టుకొండి. ఇదే నెల్లూరు జిల్లాలో విశ్వసముద్ర బయో ఎనర్జీ ప్లాంట్ వస్తోంది. రోజుకు 200 కిలోలీటర్ల కెపాసిటీతో నెలకొల్పతున్న బయో ఇథనాల్ ప్లాంట్ ఇది. దీనివల్ల 500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు వస్తాయి. రూ.315 కోట్లతో వచ్చే ఈ ప్రాజెక్టు కూడా మరో 18 నెలల్లో అందుబాటులోకి వస్తుంది. చదువుకున్న మన పిల్లలకు ఈ ప్లాంట్ వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇది చాలా సంతోషకరమైన విషయం. ప్లాంట్ డైరెక్టర్ జితేంద్రతో పాటు యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు'' అని సీఎం పేర్కొన్నారు.''అదే విధంగా తిరుపతి జిల్లాలో కాంటినెంటిల్ కాఫీ కూడా ఫ్యాక్టరీ పెడుతోంది. రూ.400 కోట్ల పెట్టుబడితో..ఏటా 16వేల టన్నుల కెపాసిటీతో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 400 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఏలూరు జిల్లాలో గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ సంస్ధ ఏర్పాటు చేస్తుంది.రూ.100 కోట్ల పెట్టుబడితో 400 టన్నుల సామర్థంతో ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టు విస్తరణకు వెళ్తున్నారు. ప్లాంట్ ఏర్పాటుకు మన దగ్గరకు వచ్చిన తర్వాత అనుమతి ఇచ్చిన కేవలం 9 నెలల్లోనే యూనిట్‌ను ప్రారంభోత్సవం చేసుకోవడం అభినందనీయం'' అని సీఎం పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించిన అమెరికా
- బెట్టింగ్‌లు, జూదం పై కఠిన చర్యలు: డిజిపి హరీష్ కుమార్ గుప్తా
- మహిళల టీ20 ప్రపంచ కప్: రికార్డు స్థాయిలో రూ.81 కోట్ల ప్రైజ్ మనీ!
- ఖతార్ ఎయిర్వేస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్...
- యూఏఈ అధ్యక్షుడు–బహ్రెయిన్ రాజు భేటీ..
- డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ మరియు ముఖ్యమైన తేదీలు!
- అందుబాటులోకి 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు
- పూర్తయిన ఆశా భోంస్లే అంత్యక్రియలు..
- తెలంగాణ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!









