శ్రీవాణి ట్రస్ట్ విరాళాలపై శ్వేతపత్రం విడుదల..
- June 23, 2023
తిరుమల: తిరుమల శ్రీవాణి ట్రస్ట్ విరాళాలపై శ్వేతపత్రం విడుదల అయింది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శ్వేతపత్రం విడుదల చేశారు. శ్రీవాణి ట్రస్ట్ కు ఇప్పటివరకు రూ. 861 కోట్ల విరాళాలు వచ్చాయని తెలిపారు. బ్యాంకుల్లో రూ. 603 కోట్లు డిపాజిట్ చేశామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
వివిధ బ్యాంకుల్లో రూ. 139 కోట్లు ఉన్నాయని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శ్రీవాణి ట్రస్ట్ డిపాజిట్లపై రూ. 36 కోట్ల వడ్డీ వచ్చిందని తెలిపారు. ఆలయాల నిర్మాణానికి ఇప్పటివరకు రూ.120 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు.
ఇచ్చిన విరాళాలకు రసీదులు ఇస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.దళారీ వ్యవస్థను అరికట్టేందుకే శ్రీవాణి ట్రస్టు ఏర్పాటు చేశామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. 70 మంది దళారులను అరెస్టు చేసి, 214 మందిపై కేసులు నమోదు చేశామని వెల్లడించారు.
తాజా వార్తలు
- JEE అడ్వాన్స్డ్ 2026 షెడ్యూల్ వచ్చేసింది..
- శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- తిరుమల మాదిరిగా యాదగిరిగుట్టలో ప్రత్యేక సేవలు
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ మూసివేత..!!
- దుబాయ్ లో జనవరి 1న పార్కింగ్ ఫ్రీ..!!
- బహ్రెయిన్ లో అమల్లోకి కొత్త ఇంధన ధరలు..!!
- అల్-ముబారకియా నుండి చేపల మార్కెట్ తరలింపు..!!
- ఒమన్ లో 12 మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్..!!
- సౌదీ అరేబియాలో అనుమానాస్పద లింక్‌ల ధృవీకరణ సర్వీస్..!!
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..







