కేపీ చౌదరి డ్రగ్స్ లిస్ట్ లో టాలీవుడ్ సెలబ్రెటీలు..
- June 25, 2023
హైదరాబాద్: కేపీ చౌదరి డ్రగ్స్ లిస్ట్ లో టాలీవుడ్ సెలబ్రెటీల పేర్లు బయటపడుతున్నాయి. కేపీ చౌదరి రిమాండ్ రిపోర్ట్ లో మరికొంత మంది సినీ తారల పేర్లు వెల్లడించడంతో పలువురు సెలబ్రిటీలలో ఆందోళన మొదలైంది. కేపీ చౌదరితో తమకు ఎలాంటి సంబంధం లేదని సెలబ్రిటీలు అంటున్నారు. మరోవైపు శనివారంతో కేపీ చౌదరి కస్టడీ ముగిసింది.
కేపీ చౌదరిని మరోసారి కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. కేపీ చౌదరిని మళ్లీ విచారిస్తే మరిన్ని లింకులు బయటపడే అవకాశం ఉందంటున్నారు. కేపీ చౌదరిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు మరోసారి సినీ సెలబ్రిటీల లిస్ట్ ను బయటపెట్టారు.
కేపీ చౌదరి రిమాండ్ రిపోర్ట్ లో మరికొంత మంది సినీ తారల పేర్లు వెలుగుచూడటం చర్చనీయాంశం అయ్యింది. పోలీసు కస్టడీలో ఉన్న కేపీ చౌదరి వారి పేర్లను వెల్లడించడంతో పలువురు సెలబ్రిటీలలో ఆందోళన మొదలయ్యింది. అయితే, కేపీ చౌదరితో తమకు ఎలాంటి సంబంధం లేదని సెలబ్రిటీలు వాదిస్తున్నారు.
ఇప్పటికే టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం రేపిన విషయం తెలిసిందే. ఎందుకంటే గతంలో డ్రగ్స్ కేసుకు సంబంధించిన ఆనవాళ్లు ఇప్పటికీ చాలా మంది సినీ తారలను వెంటాడుతున్న నేపథ్యంలో కేపీ చౌదరి డ్రగ్స్ వ్యవహారం కూడా దుమారం రేపుతుందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!
- జెబెల్ జైస్లో బేర్ గ్రిల్స్ క్యాంప్ రీ ఓపెన్..!!
- భారత్ తో CEPA..ఆందోళనల పై స్పందించిన ఒమన్..!!







