భారత్ తో CEPA..ఆందోళనల పై స్పందించిన ఒమన్..!!

- December 24, 2025 , by Maagulf
భారత్ తో CEPA..ఆందోళనల పై స్పందించిన ఒమన్..!!

మస్కట్: భారత్ తో ఇటీవల కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) ఒమానైజేషన్ విధానాలను ప్రభావితం చేయదని వాణిజ్యం, పరిశ్రమ మరియు పెట్టుబడి ప్రమోషన్ మంత్రి ఖైస్ అల్ యూసఫ్ స్పష్టం చేశారు. కార్మిక మార్కెట్‌ను నియంత్రించడానికి మరియు జాతీయ ప్రయోజనాలను దృఢంగా రక్షించడానికి సుల్తానేట్ చట్టాలు ఉన్నాయని వ్యాపార వర్గాలకు హామీ ఇచ్చారు. ఈ ఒప్పందం ఒమన్ చట్టాలు మరియు నిబంధనలకు పూర్తిగా లోబడి ఉంటుందని, ఉపాధిలో ఒమానీ జాతీయులకు ప్రాధాన్యత కొనసాగుతుందని ఖైస్ అల్ యూసఫ్ తెలిపారు.

భారత్ తో CEPA  ఒప్పందం వాణిజ్యంలో ఒమన్‌కు అనేక ప్రయోజనాన్ని ఇస్తుందని అన్నారు. CEPA జాతీయ ఆర్థిక వ్యవస్థ పోటీతత్వం మరియు వైవిధ్యీకరణకు మద్దతు ఇస్తుందని, SME లను శక్తివంతం చేస్తుందని మరియు పౌరులకు ఉపాధి అవకాశాలను విస్తరిస్తుందని అల్ యూసఫ్ హైలైట్ చేశారు.  ఒమన్ వస్తువులు 400 మిలియన్లకు పైగా భారతీయ వినియోగదారులకు చేరతాయి, ఎగుమతులను బలోపేతం చేస్తాయని తెలిపారు. లాజిస్టిక్స్ మరియు పారిశ్రామిక కేంద్రంగా ఆసియా మార్కెట్లకు ప్రవేశ ద్వారంగా ఒమన్ స్థానాన్ని బలోపేతం చేస్తుందని అన్నారు. ఒమన్-భారత్ ఆర్థిక సహకారాన్ని మరింతగా పెంచడంలో, వాణిజ్యం మరియు పెట్టుబడులకు కొత్త మార్గాలను తెరవడంలో CEPA ఒక ప్రధాన వ్యూహాత్మక అడుగుగా అభివర్ణించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com