యూఏఈలో సెలవులు: 2023లో మరో 3 సుదీర్ఘ వారాంతాలు
- June 25, 2023
యూఏఈ: నివాసితులు ఈద్ అల్ అదా సందర్భంగా వచ్చే వారం సుదీర్ఘమైన సెలవులను ఆనందిస్తారు. ఏప్రిల్‌లో ఈద్ అల్ ఫితర్ సందర్భంగా మొదటి సుదీర్ఘ విరామం వచ్చిన విషయం తెలిసిందే. యూఏఈ సెలవుల అధికారిక ప్రకటన ప్రకారం.. దేశంలోని ఉద్యోగులు ఈద్ అల్ అధా, హిర్జీ నూతన సంవత్సరం సందర్భంగా మరియు ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పుట్టినరోజు సందర్భంగా మిగిలిన సంవత్సరంలో మరో మూడు సుదీర్ఘ సెలవులు రానున్నాయి. అయితే, తదుపరి సుదీర్ఘ విరామం హిజ్రీ న్యూ ఇయర్ సమయంలో మూడు రోజులు ఉంటుంది. కొత్త ఇస్లామిక్ సంవత్సరాన్ని పురస్కరించుకుని జూలై 21 పబ్లిక్ హాలిడే అని ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఉద్యోగులకు రెండు రోజుల వారాంతంతో సహా మూడు రోజుల విరామం ఉంటుంది. నాల్గవది, చివరిది సెప్టెంబర్ 29 ప్రవక్త మహమ్మద్ (స) సందర్భంగా దేశంలోని ఉద్యోగులకు మరో మూడు రోజులపాటు వారాంతం ఉండనుంది. డిసెంబర్ 2, 3 తేదీల్లో జరుపుకునే యూఏఈ జాతీయ దినోత్సవం సెలవులు వారాంతంలో రానున్నాయి.
తాజా వార్తలు
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!







