మెగా హీరోని లైన్‌లో పెట్టిన సురేందర్ రెడ్డి.!
- June 27, 2023
ఇటీవలే ‘ఏజెంట్’ సినిమాతో పెద్ద డిజాస్టర్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. స్టైలిష్ డైరెక్టర్‌గా పేరున్న సురేందర్ రెడ్డి, ఎందుకో ‘ఏజెంట్’ విషయంలో తడబడ్డాడు.
ఆ డ్యామేజ్‌ని కంట్రోల్ చేసుకోవాలంటే, అర్జెంటుగా ఓ హిట్ సినిమా చేయాలి. అందుకే మెగా కాంపౌండ్ హీరోతో కమిట్ అయినట్లు తెలుస్తోంది. మెగా కాంపౌండ్‌తో సురేందర్ రెడ్డికి మంచి సన్నిహిత సంబంధాలున్నాయ్. ‘రేసుగుర్రం’ వంటి సూపర్ హిట్ సినిమా చేయడంతో పాటూ, చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో ‘సైరా నరసింహారెడ్డి’ వంటి ఎపిక్ మూవీ కూడా చేసి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు.
ఇప్పుడు మరో మెగా హీరోని డైరెక్ట్ చేయబోతున్నాడట. ఆయన ఎవరో కాదు, యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ పంజా. వైష్ణవ్ తేజ్‌తో ఓ డీసెంట్ లవ్ స్టోరీని చేయాలనుకుంటున్నాడట. కమర్షియల్ హంగులతో కూడిన యూత్‌ఫుల్ లవ్ స్టోరీని అందుకోసం సిద్ధం చేశాడట కూడా.
వైష్ణవ్ తేజ్ కూడా అందుకు సుముఖంగానే వున్నట్లు తెలుస్తోంది. ఠాగూర్ మధు ఈ సినిమాని నిర్మించబోతున్నారట. అన్నీ సెట్ అయితే, వైష్ణవ్ ప్రస్తుతం చేస్తున్న ‘ఆది కేశవ్’ పూర్తి కాగానే సూరితో కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కించేయడం ఖాయం.
తాజా వార్తలు
- ఇంట్లో నకిలీ మద్యం తయారీ..మహిళా అరెస్టు..!!
- డొమెస్టిక్ వర్కర్ల కోసం 4వ దశ సాలరీ బదిలీ సేవ ప్రారంభం..!!
- యూదుల ప్రార్థనామందిరం పై ఉగ్రదాడి.. ఇద్దరు మృతి
- క్రిప్టో క్రైమ్..6ఏళ్ల జైలు, BD105,000 జరిమానా..!!
- బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్
- సోషల్ సెక్యూరిటీ..‘టెస్టాహెల్’ కార్డ్ ప్రారంభించిన ఖతార్..!!
- ఆర్కిటెక్చరల్ ఇన్నోవేషన్ అవార్డు ఫలితాలు వెల్లడి..!!
- హైదరాబాద్: మొదలైన ఉస్మానియా కొత్త ఆసుపత్రి పనులు
- కెనడాలో భారతీయ సినిమాల పై దాడులు
- ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్..!!