బాయ్‌ఫ్రెండ్ విషయంలో తమన్నా అంత వీకైపోయిందెందుకు.?
- June 27, 2023
దాదాపు రెండు దశాబ్ధాలుగా తమన్నా తన కెరీర్‌ని సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తోంది. తమన్నా విషయంలో ఇంతవరకూ అఫైర్లు అనే రూమర్లు రాలేదనే చెప్పాలి. స్ర్కీన్ పైన కూడా హద్దులు దాటి (ముద్దు సీన్లు గట్రా) ఎప్పుడూ నటించింది లేదు తమన్నా.
అందుకే ప్రత్యేకమైన గౌరవం వుంది తమన్నాపై ఇంతవరకూ. కానీ, ఇప్పుడా గౌరవానికి మకిలి అంటేలా వుంది. అందుకు కారణం ఈ మధ్య తమన్నా లవ్‌లో పడడమే. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తన ప్రేమను ఇటీవలే తమన్నా కన్‌ఫామ్ చేసిన సంగతి తెలిసిందే.
ఒక్కసారి లవ్‌లో పడితే ఇంతేనా.? ఆ నటుడితోనే ఆన్ స్ర్కీన్ ముద్దులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి, తమన్నా తరచూ వార్తల్లో నిలుస్తోంది. అదేనండీ తమన్నా ప్రస్తుతం ‘లస్ట్ స్టోరీస్ 2’ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సిరీస్‌లో తమన్నా తన రియల్ లైఫ్ బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి గాఢమైన ముద్దు సీన్లే కాదు, ఇంటిమేట్ సీన్లలోనూ నటించేసిందట. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది తమన్నా విషయంలో.
ఓ వైపు చిరంజీవి (భోళా శంకర్), రజనీకాంత్ (జైలర్) వంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటిస్తూనే ‘లస్ట్ స్టోరీస్ 2’ వంటి అడల్ట్ సీరిస్‌లో నటించాల్సిన ఖర్మ ఎందుకు.? దిగజారుడుతనం కాకపోతేనూ.! ఇదీ తమన్న విషయంలో వస్తున్న విమర్శలు.
తాజా వార్తలు
- క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అజారుద్దీన్
- తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా తగ్గిన చలితీవ్రత
- దుర్గమ్మ నినాదాలతో మార్మోగుతున్న బెజవాడ
- ఇక అన్ని ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్
- NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
- బహ్రెయిన్ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఇండియన్ స్కూల్..!!
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!







