పోడు పట్టాలను పంపిణీ చేసిన మంత్రి కేటీఆర్
- June 30, 2023
తెలంగాణ: మహబూబాబాద్ జిల్లాలోని గుమ్మడూరులో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఇందులో భాగంగా 24వేల 181 మంది పోడు రైతులకు 67వేల 730 ఎకరాలకు పోడు పట్టాలను పంపిణీ చేశారు. అదేవిధంగా రామచంద్రాపురం కాలనీలో 200 డబుల్ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించి లబ్దిదారులకు ఇంటిపేపర్లను అందజేశారు. అంతకుముందు మానుకోటలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద 50కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ది పనుల పైలాన్‌ను ఆవిష్కరించారు. జులై 8న మోదీ వరంగల్ పర్యటన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. మెడికల్ కాలేజీలు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వేకోచ్ ఇవ్వమని మోదీ ఎందుకు వస్తున్నారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలతో ఏర్పడిన తెలంగాణలో ఇప్పుడు సీఎం కేసీఆర్ వల్లే పోడు రైతులకు పట్టాలు వస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపడితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి సహాయం చేయడం లేదంటూ మండిపడ్డారు.
తాజా వార్తలు
- రష్యాలో డ్రోన్ దాడి.. భారత విద్యార్థికి గాయాలు
- బెంగాల్ యువకుడికి అండగా నిలిచిన అనంత్ అంబానీ
- ఇండిగో వెబ్సైట్ క్రాష్.. ఆన్లైన్ సేవలకు తీవ్ర అంతరాయం..!
- అబుదాబిలో అక్రమంగా కార్ వాష్ చేస్తే Dh4,000 వరకు జరిమానా
- బహ్రెయిన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. తల్లి, ముగ్గురు పిల్లలు మృతి
- షార్జాలో వాహన నంబర్ ప్లేట్ల సేకరణ సర్వీస్.. నూన్‌తో పోలీసుల భాగస్వామ్యం
- ఏపీ మున్సిపల్ పోరుకు సర్కార్ సిద్ధం..
- జెడ్డాలో ‘ఇండియా ఉత్సవ్’లో పాల్గొన్న కాన్సుల్ జనరల్ ఫహద్ సూరి
- గెలుపే లక్ష్యంగా పనిచేయండి.. పార్టీ శ్రేణులకు జగన్ దిశానిర్దేశం
- తప్పుదారి పట్టించిన డ్రైవింగ్.. అబుదాబిలో డ్రైవర్‌కు 6 నెలల జైలు, Dh100,000 జరిమానా







