గెలుపే లక్ష్యంగా పనిచేయండి.. పార్టీ శ్రేణులకు జగన్ దిశానిర్దేశం
- August 19, 2026
అమరావతి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ముందుకు సాగాలని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నాయకులు, స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులతో ఆయన ఒక కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో పాటు పలువురు ప్రముఖ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ప్రభుత్వ వైఫల్యాల పై జగన్ విమర్శలు
ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుత శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని జగన్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకూ వ్యతిరేకత తీవ్రమవుతోందని, ఆ ప్రజా ఆగ్రహాన్ని కప్పిపుచ్చేందుకు రకరకాల కుట్రలకు తెరలేపుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల దృష్టిని వేరే అంశాలపైకి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







